Rajinikanth:మంచి మిత్రుడిని కోల్పోయా

30
- Advertisement -

శరత్‌ బాబు నటుడు కాకముందే తనకు పరిచయం అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. చెన్నైలోని త్యాగరాయనగర్‌లో ఉన్న శరత్ బాబు నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా మాట్లాడిన శరత్ బాబు..మంచిమిత్రుడిని కోల్పోయానని చెప్పారు. శరత్‌బాబు తనకు అత్యంత సన్నిహితుడని, తనపట్ల ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు.

Also Read:WhatsApp:చాట్ లాక్

శరత్ బాబుకు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ ఉండేదన్నారు. సిగరెట్లు తాగొద్దని తనను వారించేవాడని, ఆరోగ్యంగా ఉండాలని చాలాసార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆయన కోపంగా ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయని చెప్పారు. ముత్తూ, అన్నామలై సహా చాలా సినిమాలో తామిద్దరం కలిసి నటించామని తెలిపారు.

Also Read:IPL 2023:గుజరాత్ తో చెన్నై ఢీ.. ఫైనల్ కు వెళ్లేదేవరు!

అనారోగ్యంతో 71 ఏళ్ల శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు.

- Advertisement -