కరోనా నిబంధనలు పాటించండి:వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ సలీం

115
ramzan
- Advertisement -

ఇవాళ ఉండవల్సిన వక్ఫ్ బోర్డు సమావేశం అనివార్య కారణాల వల్ల రద్దు జరిగందని తెలిపారు ఛైర్మన్ మహమ్మద్ సలీం. మీడియాతో మాట్లాడిన ఆయన రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలందరూ తమ సోషల్ డిస్టెన్స్ తో మాస్క్ లు ఉపయోగించాలన్నారు. మజిద్‌లలో ఎక్కువగా గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని…పండుగలు,దావత్‌లు,చావులు తక్కువ మందితో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని….తమ ఇళ్లల్లో పరిసరాలు శుభ్రం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు శానిటేషన్ వాడాలన్నారు. రంజాన్ పర్వదినాలల్లో కరోనా మహమ్మారి ప్రపంచం నుండి పారిపోయే విధంగా ప్రార్థనలు చేయాలన్నారు.

ప్రభుత్వం లాక్‌డౌన్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.. ప్రభుత్వం అన్ని విధాలా కోవిడ్ నిబంధనాలపై చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిబంధనలను ప్రజలు పాటించాలని….ఇతర రాష్ట్రాలలో కోవిడ్ భారీగా పెరుగుతున్నది..అక్కడ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు..తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నది.కావున ప్రజలు తగిన చర్యలు,నిబంధనలు పాటించాలన్నారు.

- Advertisement -