గోడకుర్చీ వేస్తే..ఉపయోగాలు తెలుసా?

65
- Advertisement -

ఏంటి గోడకుర్చీ వేస్తే లాభాల ? ఇడెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా.. అవునండి నిజంగానే గోడకుర్చీ వేస్తే చాలా లాభాలు ఉన్నాయట. ఇది నేను చెబుతున్నా మాట కాదు. పలు పరుశోధనల ద్వారా నిపుణులు చెబుతున్నా మాట. చిన్నప్పుడు ప్రతిఒక్కరు వాళ్ళయొక్క స్కూల్ లైఫ్ లో గోడకుర్చీ వేసే ఉంటారు. ఏదైనా హోమ్ వర్క్ చేయకపోయిన లేదా స్కూల్ కు హాజరు కాకపోయిన ఉపాధ్యాయులు పనిస్మెంట్ గా గోడకుర్చీ వేయించే వారు. గోడకుర్చీ అనగా అందరికీ తెలిసే ఉంటుంది. గోడకు శరీరాన్ని ఆనించి సగభాగం వరకు కిందకు దించి కాళ్లపైనే భారంపడేలా ఉండడం. దీనిని వేసిన వారు ఏదో తప్పు చేశారని భాగాన స్కూల్ లైఫ్ లో ఉండేది. కానీ గోడకుర్చీ వేయడం వల్ల చాలానే లాభాలు ఉన్నాయని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

గోడకుర్చీని ఫిట్నెస్ భాషలో వాల్ స్క్వాట్ అని అంటారు. ఇది ప్రతిరోజూ వేయడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయట. ముఖ్యంగా కాళ్ళ కండరాలు బలంగా తయారవుతాయి. ఇంకా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ప్రతిరోజూ వాల్ స్క్వాట్ వేయడం వల్ల కాళ్ళ నుంచి తల వరకు రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. తద్వారా లో బీపీ, హైబిపి వంటి సమస్యలు దురమౌతాయని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా దూరమై ఏకాగ్రత పెరుగుతుందట. సాధారణంగా శారీరక వ్యాయామంలో భాగమైన రన్నింగ్, సైక్లింగ్, ఏరోబిక్ వంటి ఎక్సరసైజ్ లతో ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో అవన్నీ వాల్ స్క్వాట్స్ ద్వారా కూడా లభిస్తాయట. ఇంకా ప్రతిరోజూ గోడకుర్చీ వేయడం వల్ల కీళ్లనొప్పులు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గోడకుర్చీని పనిస్మెంట్ లా భావించకుండా దానిని ఒక వ్యాయామంలా చేయాలని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Rohith:ప్లీజ్ కంబ్యాక్.. రోహిత్?

- Advertisement -