ఫ్యామిలీతో  వచ్చి  ఓటేసిన  స్టార్స్    

40
- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ ఓబుల్ రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయ‌డానికి టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ లైన్‌లో నిల‌బ‌డ‌గా, అక్క‌డున్న వారంతా ఆయ‌న‌ను ఫొటోలు తీయ‌డానికి ఎగ‌బ‌డ్డారు. దీంతో ఆయ‌న మీరంద‌రూ ఇక్క‌డే ఉంటే ఓట్లు వెయ్య‌రా? అని స‌ర‌దాగా ప్ర‌శ్నించారు. మీరు వేశాక‌, మేము వేస్తామ‌ని వారు బ‌దులిచ్చారు. మొత్తానికి  పోలింగ్ బూత్ వ‌ద్ద ఎన్టీఆర్ ఫ‌న్నీ కామెంట్స్‌ చేయడం అక్కడున్న వారందర్నీ ఆకట్టుకుంది.  
 
 
 
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెలంగాణ ఎల‌క్ష‌న్స్‌లో భాగంగా భార్య‌తో క‌లిసి ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ, “మేం మా ఓటు వేశాం. మ‌రి మీరు? ఓటు వేసి గ‌ర్వ‌ప‌డే ఓట‌రుగా నిలవండి” అంటూ త‌మ ఫొటోను ట్వీట్ చేశాడు రాజ‌మౌళి. కాగా, రాజ‌మౌళి త‌న ఓటు హ‌క్కును జూబ్లిహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్‌లో వినియోగించుకున్నారు.
 
 
మొత్తమ్మీద త‌మ ఓటు హ‌క్కును వినియోగించ‌డానికి సినీ సెల‌బ్రిటీలు పోలింగ్ బూత్‌లకు క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న ఫ్యామిలీతో కలిసి ఓటు వేయ‌డానికి జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌కు వ‌చ్చారు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. మొత్తానికి  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పోలింగ్‌ అట్టహాసంగా జరుగుతుంది.  
 
 
 
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ త‌న కొడుకు రోష‌న్, భార్య ఊహ‌తో క‌లిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వ‌చ్చాడు. యంగ్ హీరో నితిన్ కూడా జూబ్లీహిల్స్ క్ల‌బ్‌లో త‌న ఓటు వినియోగించుకోవ‌డానికి పోలింగ్ బూత్‌కు వ‌చ్చాడు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
- Advertisement -