రివ్యూ: w/o రామ్

301
W/O Ram Movie Review
- Advertisement -

ఇన్నోవేటివ్ థాట్స్ ను ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టైల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న కథే ‘వైఫ్ ఆఫ్ రామ్’.మోహన్ బాబు కుమార్తెగానే కాకుండా నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సినిమా పోస్టర్లు,ట్రైలర్‌తో ఆసక్తిరేకెత్తించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో లేదో చూద్దాం…

కథ:

రామ్‌ (సామ్రాట్‌), దీక్ష(మంచు లక్ష్మి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఓ ప్రమాదంలో రామ్‌ చనిపోతాడు. అయితే అది ప్రమాదం కాదని హత్య అని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది దీక్ష. కానీ పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేక పోతారు. ఈ నేపథ్యంలో తన భార్త చావుకు కారణమైన వారు ఎవరు..?వారిని ఎలా కనిపెడుతుంది..?ఆ ప్రయాణంలో దీక్షకు ఎదురైన అనుభవాలు ఎంటి అనేదే w/o‌ రామ్‌ కథ.

manhcu laxmi

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నేపథ్య సంగీతం, మంచు లక్ష్మీ నటన. భర్తను కొల్పోయి,ఆ కేసును చేధించే మహిళగా మంచు లక్ష్మి తన నటనతో ఆకట్టుకుంది. వన్‌ ఉమెన్‌ షోలా సినిమా మొత్తం తానే నడిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్ అనిపిస్తుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఆదర్శ్‌ విలన్‌ రోల్‌ లో పర్ఫెక్ట్ గా ఫిట్‌ అయ్యాడు.సామ్రాట్‌తో సహా మిగిలినవన్నీ చిన్న పాత్రలే.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్,కామెడీ లేకపోవడం.కథనంలో వేగం తగ్గడం,కథను ప్రారంభించిన విధానం, ముగించిన పద్ధతి బాగున్నా మధ్యలో ఆ కథను నడిపించిన తీరు మాత్రం కాస్త వికటించింది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం,సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగుంది. సినిమాకుమరో ప్లస్‌ పాయింట్‌ రఘు దీక్షిత్‌ మ్యూజిక్‌. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. తొలి సినిమానే థ్రిల్లర్‌ జానర్‌ లో చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు విజయ్‌ ఎలకంటి తన వంతు ప్రయత్నం చేశాడు.

తీర్పు:

థ్రిల్లర్‌ జానర్‌లో మంచు లక్ష్మి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం w/o రామ్. మంచు లక్ష్మి నటన,సాంకేతిక విభాగం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కామెడీ లేకపోవడం,కథనంలో వేగం తగ్గడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఎవరి రోగాన్ని వాళ్లే నయం చేసుకోవాలి అనే ఒక సందేశాన్ని ఇవ్వగలిగిన చిత్రం w/o రామ్‌.

విడుదల తేదీ:20/07/2018
రేటింగ్: 2.5/5
సినిమా పేరు: w/o రామ్‌
నటీనటులు: మంచు లక్ష్మి, ఆదర్శ్‌ బాలకృష్ణ
సంగీతం: రఘు దీక్షిత్‌
నిర్మాణ సంస్థలు: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ యేలకంటి

- Advertisement -