టీజర్‌తో వస్తున్న పేపర్ బాయ్‌…

224
paper boy
- Advertisement -

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’.టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటివరకు ఫస్ట్ లుక్‌,పోస్టర్‌లను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌తో రాబోతుంది. రేపు ఉదయం 10 గంటలకు సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. పేపర్ బండిల్స్‌పై కూర్చుని ఉన్న హీరో లుక్ ఆకట్టుకుంటోంది.

Paper Boy Movie First Look

సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. నటీనటులు పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.సాంకేతిక నిపుణులు: కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : సంపత్ నంది, డైరెక్షన్: వి. జయశంకర్, నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ, సంగీతం: భీమ్స్, ఎడిటర్: తమ్మిరాజు, సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్. ఆర్ట్: రాజీవ్, స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల.

- Advertisement -