గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీల ఆగ్రహం

219
TRS Mps Fire on MP Galla jayadev
- Advertisement -

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడిన గల్లా…రాష్ట్రాన్ని అ ప్రజాస్వామికంగా విభజించారని తెలిపారు. అనాలోచితంగా తీసుకున్న చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతుందన్నారు.

అయితే గల్లా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. గల్లా స్పీచ్‌ను అడ్డుకున్నారు. దీంతో జోక్యం చేసుకున్న స్పీకర్ సుమిత్రా మహాజన్…ఏదైన తప్పు ఉంటే సవరించేందుకు సిద్దమని…అవిశ్వాస తీర్మానంపై చర్చ సజావుగా సాగేలా చూడాలని కోరారు. దీంతో తర్వాత తన స్పీచ్‌ని కంటిన్యూ చేశారు గల్లా జయదేవ్.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పూర్తి మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్రజాస్వామిక అనే మాటను లోక్‌సభ రికార్డుల్లో నుంచి తొలగించాలని స్పీకర్‌కు జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ఇక స్పీచ్ సందర్భంగా భరత్ అనే నేను సినిమా స్టోరీని ప్రస్తావించారు గల్లా జయదేవ్. ప్రజలకు ఇచ్చిన మాట కోసం చివరివరకు నిలబడాలన్న కథాంశం అందరికి నచ్చిందన్నారు.

- Advertisement -