“అల్లుడు అదుర్స్” బ్లాక్ బస్టర్ అవ్వాలి: వీవీ వినాయక్

196
vv
- Advertisement -

‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా నిర్మించిన చిత్రం ” అల్లుడు అదుర్స్”. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాగా ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ వేడుక అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో కుటుంబ సభ్యులు ఆత్మీయ అతిధుల మధ్య పండగ వాతావరణాన్ని తలపించేలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్స్ నభానటేష్, మోనాల్ గజ్జర్, నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, పాటల రచయితలు భాస్కరబట్ల, శ్రీ మణి, ఫైట్ మాస్టర్స్ స్టంట్ శివ, కెవిన్, చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు, బెల్లంకొండ సురేష్, చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం, సమర్పకుడు గంజి రమేష్, నిర్మాతలు మహేంద్ర, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.. “అల్లుడు అదుర్స్” బిగ్ సీడీని వినాయక్ రిలీజ్ చేయగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలయింది.. మొదటి టికెట్ ని అనిల్ రావిపూడి కొనుగోలు చేశారు. నిర్మాతల సతీమణులు పద్మావతి, హేమ, రమ్య కలిసి థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ చేశారు.

సెన్సేషనల్ డైరెక్టర్ వివి. వినాయక్ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాలో సాయి చాలా అందంగా ఉన్నాడు. కాస్ట్యూమ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. నాలుగు పాటలు చూశాను. ఆకలి మీద వున్న పులిలా విరుచుకుపడి కసితో డాన్సులు, ఫైట్స్ రచ్చ రచ్చలా చేశాడు సాయి. సినిమా అంటే పిచ్చితో రాజమండ్రి నుండి వచ్చి ఫ్యాషన్ తో తన పార్ట్నర్ రమేష్ తో కలిసి ఈ చిత్రాన్ని భారీగా రిచ్ గా నిర్మించారు సుబ్రమణ్యం. వారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి, మంచి పేరు డబ్బులు రావాలని కోరుకుంటున్న. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేసి ఫుల్ పాక్డ్ గా సంతోష్ శ్రీనివాస్ సినిమాని అద్భుతంగా తీశాడు. తప్పకుండా ఈ చిత్రం సంతోష్ శ్రీనివాస్ కి మంచి పేరు తెస్తుంది. బిగ్ స్కేల్ లో సంక్రాంతికి వస్తున్న “అల్లుడు అదుర్స్” పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ పాండమిక్ టైంలో సినిమాలు తీసే మా లాంటి వారు నెక్స్ట్ ఏంటి అని చాలా సందిగ్ధంలో పడ్డాం. ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘క్రాక్’ చిత్రాలు రిలీజ్ అయి సక్సెస్ బాటలో నడుస్తున్నాయి. ఇప్పుడు మాకు చాలా ధైర్యం వచ్చింది. థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తూ మాకు మరింత మనో ధైర్యాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. నా కేరియర్ బిగినింగ్ స్టేజ్ లో ‘కందిరీగ’ సినిమాకి నేను సంతోష్ శ్రీనివాస్ గారి దెగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా వర్క్ చేశాను. 2010 నుండి మా జర్నీ సాగుతుంది. ఆ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి నా థాంక్స్. నా సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు వచ్చే ఐదు కాల్స్ లో ఆయనది ఉంటుంది. ఒక బ్రదర్ లా విష్ చేస్తాడు. ఈ సినిమాకి నాకు చిన్న కనెక్షన్ ఉంది. వాసు చక్కగా ఈ కథని డిజైన్ చేసుకున్నాడు.. నేను కొన్ని సలహాలు ఇచ్చాను అంతే.. పెద్దగా ఏమి చేయలేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలి. పడిపోయా పాట నాకు బాగా ఇష్టం. చోటా గారు ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. దేవి అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేశాడు. అల్లుడు శ్రీనుతో సాయి మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకి వెరీయేషన్స్ పెంచుకుంటూ సాయి మంచి సినిమాలు చేస్తున్నాడు. రాక్షసుడులో సాయి డాన్సులు మిస్ అయ్యాం. ఈ సినిమాతో ఆ వెలితి తీరింది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని.. అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ అన్ కాంప్రమైజ్డ్ గా బిగ్ బడ్జెట్ తో అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సుబ్రమణ్యం, రమేష్ గారికి కృతజ్ఞతలు… ఫస్ట్ టైమ్ మా నాన్నని ఒక మంచి సినిమా చేసి పెట్టండి. మీ జడ్జిమెంట్ బాగుంటుంది అని అడిగాను. వెంటనే సంతోష్ శ్రీనివాస్ కి కాల్ చేసి కథ చెప్పామన్నారు. ఆయన ఇమీడియట్ గా వచ్చి ఎక్స్టా ర్డినరీ కథ చెప్పి నాలుగు నెలలు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. సంవత్సరం న్నర పాటు ఎంతో కష్టపడి ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. నభానటేష్ గుడ్ పెర్ఫార్మర్..సూపర్బ్ గా చేసింది. అను ఇమ్మనుయెల్ క్యారెక్టర్ లో సప్ర రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దేవిశ్రీప్రసాద్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు.. ఆర్ ఆర్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. చోటా గారు బ్యూటిఫుల్ విజువల్స్ సినిమాకి హైలెట్ అవుతాయి. సినిమా 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. సినిమా బాక్గ్రౌండ్ కంటే కష్టాన్ని నమ్ముకొని వచ్చిన వారు సక్సెస్ అయ్యారు.. వాళ్ళు ఎంతో కష్టపడి స్టార్స్ రేంజ్ కి వెళ్లారు. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. మా కష్టాన్ని గుర్తించండి.. ఒక మంచి సినిమా చేశాం. ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమా చూసి సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. “కందిరీగ” లాంటి సినిమా మా అబ్బాయితో తియ్యాలని కోరిక ఉండేది.. అది ఈ సినిమాతో నెరవేరింది. మా అబ్బాయి కాబట్టి చాలా ఖర్చుపెట్టి ప్రేమతో అల్లుడు శ్రీను సినిమా తీశాను.. అది హిట్ అయింది. ఇప్పుడు అల్లుడు అదుర్స్ అనిపించే రేంజ్ లో చాలా గ్రాండియర్ గా సినిమా తీసిన సుబ్రమణ్యం, రమేష్ కి థాంక్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయి వాళ్ళు అందరి హీరోలతో సినిమాలు తీసి మంచి నిర్మాతలుగా ఇండస్ట్రీలో నిలబడాలని ఆశీర్వదిస్తున్నాను.. కందిరీగ లాంటి సినిమా చెయ్యాలి మంచి కథ ఉంటే చెప్పు అని వాసుకి కాల్ చేశాను. ఉంది సార్ అని మూడు రోజుల్లో వచ్చి స్టోరీ చెప్పాడు. సూపర్ గా ఉంది. ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు హార్రర్ మిక్స్ చేసి అత్యద్భుతంగా సినిమాని తీసిన శ్రీనివాస్ కి న థాంక్స్. ఆవినాష్ సూపర్బ్ సెట్స్ వేశాడు. చోటా, తమ్మిరాజు చాలా కష్టపడ్డారు. అడిగిన వెంటనే వచ్చి కథలో కొన్ని మార్పులు చెప్పి కందిరీగ వాసు సూపర్ హిట్ డైరెక్టర్ లా ఉండాలని హెల్ప్ చేసిన అనిల్ రావిపూడికి నా కృతజ్ఞతలు. స్టంట్ శివ కొడుకులు కెవిన్ , స్టీఫెన్ లు ఈ సినిమాకి వాండ్రఫుల్ గా రెండు ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఫ్యూచర్ లో పెద్ద ఫైట్ మాస్టర్స్ గా ఎదుగుతారు.. అన్నారు.

చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ” మా హీరో సాయి కష్టజీవి. చాలా హార్డ్ వర్కర్. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. సినిమా చాలా బాగా వచ్చింది. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటూ.. పట్టుదలతో మా బ్యానర్లో ఫస్ట్ సినిమా చేసిన సంతోష్ శ్రీనివాస్ కి థాంక్స్. చోటా గారు బ్యూటిఫుల్ విజువల్స్, దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. టీమ్ అందరూ బాగా సపోర్ట్ చేసి మంచి సినిమా చేశారు.. కేవలం డబ్బులు ఉంటే సినిమా తీయడం కష్టం.దానికి సరైన బ్రాండ్ కలిగిన వ్యక్తి ఉండాలి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సురేష్ గారివల్లే ఈ సినిమా తీయడం సాధ్యం అయింది. నా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ కొండంత ధైర్యాన్ని ఇచ్చి సినిమా చేసిపెట్టిన బెల్లంకొండ సురేష్ గారికి నా థాంక్స్… అన్నారు.

చిత్ర సమర్పకుడు గంజి రమేష్ మాట్లాడుతూ.. ” అల్లుడు అదుర్స్” సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. మంచి కథతో చాలా బాగా ఈ సినిమాని తెరకెక్కించారు. మా హీరో సాయి డాన్సులు, ఫైట్స్, కామెడీ బాగా చేశాడు. ఇంతకుముందు సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఒక ఎత్తు. సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు.. అన్నారు.

చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” నాకు ఫస్ట్ సినిమా కందిరీగ చేసే ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ సురాహ్ గారికి నా థాంక్స్. వారి అబ్బాయి సాయి శ్రీనివాస్ పెద్ద పొజిషన్లో ఉండాలి అని కోరుకునే వాళ్లలో నేను ఒకడిని. సాయి చేత ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కామెడీ చేయించాలని ప్లాన్ చేశాం. అది ఎంత బాగా చేసాడనేది స్క్రీన్ పై కనిపిస్తుంది. సాయి నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. కథపై నమ్మకంతో భారీగా ఖర్చుపెట్టి సినిమా తీసి.. మా సినిమా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ తో ధైర్యంగా ఉన్న సుబ్రమణ్యం, రమేష్ గారికి నా థాంక్స్. ఒక పెద్ద బలమైన సినిమా పండక్కి రావాలంటే దాని వెనుక ఒక బలమైన శక్తి ఉండాలి. ఆ బలమైన శక్తి బెల్లంకొండ సురేష్ గారు. చోటా గారు లేకపోతే ఈ సినిమా లేదు. అదుర్స్ అనిపించే రేంజ్ లో విజువల్స్ ఇచ్చారు. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమాకి ప్రాణం సంగీతం. దేవి మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. ఆర్ ఆర్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. సినిమా అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే సినిమా.. పండక్కి ప్రతి ఇంటికి అల్లుడు వస్తాడు. మా అల్లుడు అదుర్స్ అనిపించుకుంటాడు అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.. అన్నారు.

- Advertisement -