ప్రభుత్వ ఉద్యోగుల్లో పండుగలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ..

22
green

గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్లు ఎ వేంకటేశ్వర్లు గారు నర్సంపేట , సుజాత గారు అమీన్ పూర్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ లో హరిత హరం కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో పచ్చదనంతో కళకళ లాడు తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమం లో పల్లెలకు ప్రాధాన్యానికి హరితహారం ఇప్పటి వరకు 211 కోట్లు మొక్కలు నాటి సరికొత్త రికార్డు నెలకొల్పారని తెలిపారు.

3శాతం పెరిగిన పచ్చదనం 42,803 హెక్టార్లలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ మూడున్నర లక్షల హెక్టార్లలో అడవుల పునర్జీవం 230 కోట్ల మొక్కల లక్ష్యం దిశగా పరుగులు వేస్తుంది దీనికి తోడుగా ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం స్థాపించి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో ప్రముఖులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అని తేడాలేకుండా అందరూ అద్భుతంగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనేలా చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు ఈ కార్యక్రమం నీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తన్న సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు… అడవులను దత్తత తీసుకునే కార్యక్రమం అద్భుతమని కొనియాడారు.