బాధ – ఆవేదన మధ్యలో ఆ దర్శకుడు!

10
- Advertisement -

వివి వినాయక్.. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. రాజమౌళికి పోటీ ఇచ్చిన దర్శకుడు కూడా. అయితే, ఎప్పటి నుంచో మరో భారీ హిట్ కొట్టి, తన చిరకాల కోరిక తీర్చుకుని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో మళ్లీ సగర్వంగా తన పేరును చూసుకోవాలని వినాయక్ ఎంతో ఆశ పడుతున్నాడు. కానీ, ఆ హిట్ మాత్రమే రావడం లేదు. దాంతో ఆయన తన తర్వాత సినిమా ఏం చేయాలి అనే క్వశ్చన్ దగ్గరే ఎంతో మధనపడి, మొత్తానికి పెదకాపు హీరో విరాట్ కర్ణ తో ఒక సినిమాని సెట్ చేసుకున్నాడు.

విరాట్ కర్ణ తన కొత్త సినిమా ‘పెదకాపు 2’ సినిమాను దాదాపు పూర్తి చేశాడు. అలాగే ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే, విరాట్ కర్ణ ఇంత బిజీగా ఉండి కూడా.. ఇప్పుడు వినాయక్ సినిమాకి ఎంపిక అయ్యాడు. ఈ చిత్రం ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరో ఐదు నెలల్లో ఈ సినిమా పూర్తవుతుంది. దర్శకుడు వివి వినాయక్ ఇప్పటికే కథని లాక్ చేశారు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. అయితే, ఈ సినిమా మేకింగ్ విషయంలో వినాయక్ కి చాలా పరిమితులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా వినాయక్ అడిగినంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాత ముందుకు రావడం లేదు. ప్లాప్ కారణంగా చులకన కావడం చాలా బాధాకరమైన విషయం. పైగా మ్యాటర్ ఉండి కూడా సరైన సక్సెస్ రాకపోతే కలిగే బాధ మాటల్లో చెప్పుకునేది కాదు. ఆ బాధ ఆవేదన ప్రస్తుతం వినాయక్ లో ఎక్కువైపోయాయి.

Also Read:మడత పెట్టేదెవరు.. జగనా ? చంద్రబాబా ?

- Advertisement -