కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ పిలుపునిచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచి ఢిల్లీలో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలన్నారు మేడిపల్లి వివేక్.
ఈ సందర్భంగా తెలంగాణలోని తమ బంధుమిత్రులకు ఫోన్లు చేసి కారు గుర్తుకు ఓటేయించాల్సిందిగా కోరామని తెలిపారు వివేక్.లోక్సభలో తెలంగాణ గళాన్ని వినిపించి, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవితను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పసుపు బోర్డు కోసం ఎంపీ కవిత పార్లమెంట్లో పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ నియోజకవర్గానికి సమకూర్చని నిధులు 15 వేల కోట్లను ఒక నిజామాబాద్ కోసమే ఎంపీ కవిత సమకూర్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శాఖ ఉపాధ్యక్షులు కంది వంశీ, అనుమాండ్ల లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, రమేశ్ గౌడ్, రాజుకుమార్, రవితేజ, మనోజ్, భరత్, శశి తదితరులు పాల్గొన్నారు.