ఆగస్ట్ 14న విష్వ‌క్‌ సేన్ ‘పాగల్’..

110
Vishwak Sen

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ యువ క‌థానాయ‌కుడి లేటెస్ట్ మూవీ ‘పాగల్’. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. శనివారం సినిమా రిలీజ్ డేట్‌కు అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది. అంటే సినిమా ప్రేమకథా చిత్రమని పోస్టర్ తెలియజేస్తుంది.

ఇదొక అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌. నరేశ్ కుప్పిలి ద‌ర్శ‌కుడు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పాగల్’ చిత్రంలో విష్వ‌క్ సేన్‌ స‌రికొత్త స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను ‘పాగల్’ సినిమాలో చేస్తున్నారు విష్వ‌క్‌సేన్‌.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచాయి. ‘పాగల్’ రిలీజ్ డేట్ చాలా ద‌గ్గ‌రగా ఉంది. దీంతో మేక‌ర్స్ ఈ సినిమాకు భారీ ఎత్తున ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాల‌ను ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా క‌నిపించ‌నున్నారు. ర‌ధ‌న్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌

న‌టీన‌టులు: విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్రాన్ చౌద‌ర‌ని, మేఘా లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: బెక్కెం వేణుగోపాల్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ కుప్పిలి
సినిమాటోగ్రఫీ: మ‌ణికంద‌న్‌
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌
పాట‌లు: చంద్రబోస్, రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, అనంత శ్రీరాం
ఫైట్ మాస్ట‌ర్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌
డాన్స్ మాస్ట‌ర్‌: విజ‌య్ బిన్ని
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సిద్ధం విజ‌య్ కుమార్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌