బిగ్ బాస్ 5.. ఈ వారం విశ్వ ఎలిమినేట్..!

129
- Advertisement -

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఈవారం మరోకరు బయటి వెళ్లనున్నారు. బిగ్ బాస్ నుండి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, హమీదా, శ్వేత వర్మ, నటరాజ్ మాస్టర్, ప్రియా, లోబో లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కండల వీరుడుగా పేరున్న విశ్వ కూడా బయటకు వెళ్లి పోయాడు. ఆదివారం ఎపిసోడ్‌లో విశ్వ ఎలిమినేట్ అవ్వబోతున్నాడని సమాచారం. ఎప్పటిలాగే ముందే ఎలిమినేషన్ కు సంబంధించిన విషయం లీక్ అయ్యింది.

కెప్టెన్ షన్నూ ఇంకా ఆనీ మరియు మానస్ లు కాకుండా ఇంటి సభ్యులు అంతా కూడా నామినేట్ అయ్యారు. వారిలో విశ్వ మరియు జెస్సీలు మాత్రమే వీక్ అంటూ అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరిలో ఒకరు వీక్ అయ్యారు. జెస్సీకి షన్నూ స్నేహితుల సపోర్ట్ కాస్త గట్టిగానే ఉండటంతో సేవ్ అయ్యాడు. ఈ వారంలో షన్నూ నామినేట్ అవ్వలేదు. దాంతో షన్నూ ఓట్లు అన్ని కూడా జెస్సీకి పడి ఉంటాయి అంటున్నారు. అందుకే షన్నూ స్నేహితుడు అయిన జెస్సీ సేవ్ అయ్యి విశ్వ ఎలిమినేట్ అయ్యాడు.

విశ్వ వెళ్లి పోయిన తర్వాత ఇంట్లో మిగిలిన వారు షన్నూ,సిరి, రవి, కాజల్, మానస్, ప్రియాంక, సన్నీ, ఆనీ, జెస్సీ, శ్రీరామ చంద్రలు ఉన్నారు. మొత్తం 19 మంది హౌస్ లో అడుగు పెట్టగా 9 మంది ఎలిమినేట్ అయ్యారు ఇంకా పది మంది ఉన్నారు.

- Advertisement -