సీఎం కేసీఆర్ విద్యుత్ రంగానికి పెద్ద పీట వేస్తున్నారు- మంత్రి

88
Minister Indrakaran Reddy
- Advertisement -

నిర్మల్ నియోజకవర్గం సొన్ మండలం జఫ్రాపూర్ గ్రామంలో రూ. 1కోటి 10 లక్షలతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ ను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 43 సబ్ స్టేషన్ లను నిర్మించామని తెలిపారు. కొత్తగా కౌట్ల బి, కాల్వ, నర్సాపూర్(W),మాదాపూర్, రాం సింగ్ తాండలో సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామని అన్నారు. ఒక్క నిర్మల్ లొనే 50 సబ్ స్టేషన్ లను నిమిచుకుంటున్నామని తెలిపారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నీటికి, విద్యుత్ రంగానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. స్వర్ణ నది వాగు నుండి సొన్ వరకు 14 చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు 7 చెక్ డ్యామ్ లు పూర్తయ్యాయని.. జఫ్రాపూర్ లో స్కూల్ సాయి బాబా ఆలయాన్ని10 లక్షల తో, భీమన్న ఆలయాన్ని 8 లక్షలతో, మహాలక్ష్మి ఆలయాన్ని 15 లక్షలతో అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. అలాగే గురుడ రెడ్డి సంఘ భవనానికి 5 లక్షలు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామ వాసులు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, జడ్పిటిసి జీవన్ రెడ్డి, ఎంపిపి మానస హరీష్, సర్పంచ్ సునీత ప్రకాష్, నాయకులు సాయిరెడ్డి, మహేందర్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -