గ్రేటర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతిస్తాం:విశ్వబ్రాహ్మణ సంఘం

269
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ఇస్తామని, ఈ మేరకు సంఘం తీర్మానం చేసిందని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం వెల్లడించింది. బుధవారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ లకు తగిన గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వారు తెలిపారు.

తమ సంఘం ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని, రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసునూరి బ్రహ్మానందా చారి, ప్రధాన కార్యదర్శి లాలుకోట వెంకటచారి, కోశాధికారి పులిగిళ్ళ రంగాచారి తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం కోసం సొంత ఖర్చుతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని వారు ప్రకటించారు. ఈ భేటీలో పాల్గొన్న వారిలో సంఘం ఉపాధ్యక్షుడు చొల్లేటి కృష్ణమాచారి, కార్యదర్శి పెద్దపల్లి పురుషోత్తమ చారి, నాయకులు వెర్రోజు వేణుగోపాల్, కృష్ణమూర్తి చారి, మాదన్మోహన్, భాస్కర్ చారి, రవీందర్ చారి, బాలక్రిష్ణ, తదితరులు ఉన్నారు.

- Advertisement -