ఎన్నికల విధానంలో మార్పు రావాలి..

126
vinod kumar
- Advertisement -

దేశంలో ఎన్నికల విధానంలో మార్పు రావాలన్నారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆయన..మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుతో ప్రజల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు.

ప్రజా బలానికి తోడు దైవ బలం కూడా ఉండటంతో మునుగోడులో గెలిచామన్నారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దామన్నారు. పాత ఆలయాన్ని యధావిధిగా కొనసాగిస్తూనే అభివృద్ధిని చేస్తామన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.దేశంలో ఎన్నికల విధానంలో సమూల మార్పులు రావాలన్నారు. ఇతర దేశాల్లో పార్టీకి పడే ఓట్ల ఆధారంగా అభ్యర్థులు ఎన్నికవుతారని చెప్పారు. భారత్‌లో కూడా అలాంటి విధానమే రావాలన్నారు.

32 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ తరపున ప్రధాని మోదీ పరిపాలిస్తున్నాడని, అయితే 62 శాతం మంది ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారన్నారు. ఇతర దేశాల్లోలానే పార్టీకి వచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులు పరిపాలించే స్థాయికి చేరాలన్నారు.

- Advertisement -