మహేష్ టైటిల్‌ను వాడుకున్న విశాల్‌..!

312
Vishal Tamil Movie Telugu Remake Title As Abhimanyudu
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు రీసెంట్ మూవీ స్పైడర్. ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేయడానికి చాలా సమయమే తీసుకున్నారు. స్పైడర్ పేరు అనౌన్స్ చేయకముందు అనేక పేర్లు వినిపించాయి. వీటిలో అభిమన్యుడు అనే టైటిల్‌ ఒకటి. అయితే ఈ పేరు విషయంలో మహేష్‌ పూర్తి సంతృప్తి ప్రకటించకపోవడంతో చివరకు సినిమా థీమ్ కు తగినట్లుగా స్పైడర్ అనే పేరును ఖాయం చేసుకున్నాడు. ఇప్పుడు అభిమన్యుడు అనే టైటిల్‌ ను కోలీవుడ్ హీరో విశాల్ తన కొత్త సినిమాకు ఫిక్స్‌ చేసుకున్నాడు.

Vishal Tamil Movie Telugu Remake Title As Abhimanyudu

ప్రస్తుతం విశాల్ తమిళంలో ‘ఇరుంబు తిరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. విశాల్ సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను సంక్రాంతికి విడుదల కానుంది. తమిళంలో ‘ఇరుంబు తిరాయ్’ అంటే ‘ఇనుప తెర’ అని అర్థం. తాజాగా తెలుగులో ఈ సినిమాకి ‘అభిమన్యుడు’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.

- Advertisement -