విశాల్ …‘రత్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్

18
- Advertisement -

మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటి యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూసి మాస్ లవర్స్‌లో ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.

రత్నం ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్‌లో విశాల్ యాక్షన్ మూవీ థియేటర్లోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది.

Also Read:TTD:రామకృష్ణ తీర్థ ముక్కోటి

- Advertisement -