ముల్తాన్‌కా సుల్తాన్‌..

292
sehwag
- Advertisement -

వీరేంద్ర సెహ్వాగ్…విద్వంసకర ఇన్నింగ్స్‌కు పెట్టింది పేరు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్ల సహనానికి పరీక్షే. టెస్టు,వన్డే,టీ 20 ఫార్మాట్ ఏదైనా బాదుడు బాదుడే. ఈ నేపథ్యంలో టీమిండియా చరిత్రలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసిన సెహ్వాగ్..ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ గడ్డపై ముల్తాన్ టెస్టు ఇప్పటికీ..ఎప్పటికీ ఎవర్‌గ్రీనే.

భారత్ తరపున తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్…17 సంవత్సరాల క్రితం నాటి ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. 2004లో దాయాది దేశంలో పర్యటించిన భారత జట్టు, నాటి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ముల్తాన్‌ టెస్టులో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు సెహ్వాగ్. ట్రిపుల్‌ సెంచరీ(309 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

తర్వాత సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశారు సెహ్వాగ్. ఈ నేపథ్యంలో ముల్తాన్‌కా సుల్తాన్‌కు క్రికెట్ ఫ్యాన్స్‌ బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

- Advertisement -