అన్న హీరోయిన్‌తో అల్లు శిరీష్‌ ప్రేమాయణం..!

252
allu shirish
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌తో హీరో అల్లు శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్న‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్‌ పుట్టినరోజు వేడుక‌ను జ‌రుపుకుంది. ఈ నేప‌థ్యంలో ఆమెతో క‌లిసి శిరీష్ క్లోజ్‌గా వీడియో తీసుకున్నాడు.

ఈ వీడియోలో ఇద్ద‌రూ మాట్లాడుతుండడం చూడవచ్చు.. తాను ఆల‌స్యంగా విషెస్‌ చెబుతున్నానని త‌నకు తెలుసని శిరీష్ అన్నాడు. ఈ వీడియోతో రావడానికి లేట్‌ అయ్యిందని పేర్కొన్నాడు. ‘హ్యాపీ బర్త్‌డే సైకో’ అంటూ విషెస్‌ చెప్పాడు. ప్ర‌స్తుతం అనుతో అల్లువారబ్బాయి డేటింగ్‌లో ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలోనూ నటించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది.

- Advertisement -