కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ..

111
Virat Kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు కోహ్లీ. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరాడు. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలన్నాడు. వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే డబ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇండియ‌న్ టీమ్ త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ వెళ్ల‌నుంది. ఆలోపే ఆ టీమ్‌లోని ప్లేయ‌ర్స్ అంద‌రూ త‌మ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని భావిస్తున్నారు.

ఇప్పటికే శిఖర్ ధావన్, టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఐపీఎల్ వాయిదా ప‌డ‌గానే ఇంటికెళ్లిపోయిన కోహ్లి.. ఆ వెంట‌నే కొవిడ్ స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతోపాటు త‌న‌వంతుగా రూ.2 కోట్లు విరాళ‌మిచ్చాడు. భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి మ‌రిన్ని విరాళాలు సేక‌రిస్తున్నాడు.