నూతన రెవెన్యూ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి..

45
Minister Gangula Kamalakar

గ‌తంలో క‌రీంన‌గ‌ర్ మండ‌లానికి ఒక్క‌టే ఉన్న భ‌వ‌నం శిథిలావ‌స్థ‌కు చేర‌డంతో నూత‌నంగా కొత్త‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ మండ‌లాల ఏర్పాటుతో జిల్లాలోని మూడు ఎంఆర్వో కార్యాల‌యాల‌కు నూత‌న భ‌వానాలు మంజూరు చేయడం జరిగింది. అత్యాదునిక కంప్యూట‌ర్ రూంతో పాటు రెవెన్యూ సేవ‌ల నిమిత్తం కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం స‌క‌ల హంగుల‌తో క‌రీంన‌గ‌ర్ అర్బ‌న్, రూర‌ల్, కొత్త‌ప‌ల్లి రెవెన్యూ కార్యాల‌యాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఈ కార్యలయాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

అనంతనం మంత్రి మాట్లాడుతూ.. నేటి నుండి కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌య్యే ఈ భ‌వనాల్లో వెయింటింగ్ రూం, రికార్డుల గ‌ది, ధ‌ర‌ణి స‌ర్వ‌ర్ రూం తో పాటు సిబ్బందికి కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సౌక‌ర్యం కోసం నిరంత‌రం పనిచేస్తుందన్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ఆధునీక‌రించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాల‌తో వాటిని తీర్చిదిద్దుతోంది. అందుకు ఈరోజు క‌రీంన‌గ‌ర్‌లో ప్రారంభించిన నూత‌న భ‌వ‌నాలే సాక్ష్యం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారుల‌తో పాటు ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.