కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జూన్‌ 23న…

44
congress

ఎట్టకేలకు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న సస్పెన్షన్‌కు తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక‌కు ముహుర్తం ఖ‌రారైంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక‌ను జూన్ 23న నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ నిర్ణ‌యించింది. నేతలు, కార్యకర్తల నుండి వస్తున్న డిమాండ్ మేరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిచింది.

2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పటినుండి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.