న్యూజిలాండ్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టుబిగించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, రాహానే రాణించడంతో భారత్ 557/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (211: 366 బంతుల్లో 20×4), అజింక్య రహానె (188: 381 బంతుల్లో 18×4, 4×6) భారీ స్కోర్ సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 267/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్…కోహ్లి,రహానే మరో వికెట్ పడకుండ జాగ్రత్తగా ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.
వీరిద్దరు వెనుదిరిగిన రోహిత్ శర్మ (51 నాటౌట్: 63 బంతుల్లో 3×4, 2×6) మెరుపు అర్ధశతకం పూర్తి చేసుకోగానే కెప్టెన్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. భారత్ జట్టులో ఓపెనర్లు మురళీ విజయ్ (10), గంభీర్ (29) నిరాశపరచగా.. పుజారా (41) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జీతన్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టాడు.
విరాట్ కోహ్లి టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. అతని ఖాతాలో ఇప్పటికే 13 సెంచరీలు ఉన్నాయి. 347 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ గా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో కోహ్లికిదే అత్యధిక స్కోరు.వెస్టిండీస్ తో ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లి.. ఆ తర్వాత 8 ఇన్నింగ్స్ లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు మరో డబుల్ సెంచరీతోనే ఫామ్ లోకి రావడం విశేషం.
.@imVkohli becomes first captain of India to score two Test double hundreds pic.twitter.com/eIcuxdmFuD
— BCCI (@BCCI) October 9, 2016