విరుష్క మళ్లీ పెళ్లి..

268
Virat Kohli And Anushka Sharma Need To Marry Again
- Advertisement -

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరోమారు పెళ్లి చేసుకోనున్నారు. వాస్తవానికి వీరిద్దరూ గత నెలలో ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలలో అదిరిపోయేలా విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో కోహ్లీ బిజీగా ఉండగా, వెంట కొత్త పెళ్లికూతురు అనుష్క కూడా వెళ్లింది. అయితే వీరద్దరూ మరోమారు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Virat Kohli And Anushka Sharma Need To Marry Again

దీనికి కారణం కూడా ఉంది. వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారట. దీంతో ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా మ్యారేజ్ సర్టిఫికెట్‌కు అప్లై చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్‌లో వీరి పెళ్లి వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా ఇటు కోహ్లీ నుంచి కానీ, అటు అనుష్క నుంచి ఈ విషయంలో ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం కోహ్లీ సౌతాఫ్రికా టూర్‌తో బీజీగా ఉండడంతో టూర్ ముగిశాక పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

- Advertisement -