మెగా ఫ్యామిలీ లో నుంచి ఓకే రోజున ఇద్దరు హీరోల సినిమాలు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మొదట ఈసినిమాను జూన్ 29న విడుదల చేస్తామని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల ఆసినిమా మరో వారం రోజులు ఆలస్యంగా థియేటర్ల ముందుకు రానుంది. జులై 6వ తేదిన ఈసినిమాను విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఇక గత కొద్ది రోజుల నుంచి ఫెయిల్యూర్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈసినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.
పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ లాంటి బిగ్గెస్ట్ ఇచ్చిన కరుణాకరణ్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు. కరుణాకరణ్ ఈమధ్య తీసిన సినిమాలు కూడా ప్లాప్ కావడంతో తేజ్ ఐ లవ్ యూ మూవీ పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇక ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈమధ్యే మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ నటించిన చిత్రం విజేత. ఈమూవీ షూటింగ్ కూడా పూర్తయింది. విజేత మూవీని వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు.
ఇక తాజాగా ఉన్న సమాచారం ఏంటంటే సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ, కళ్యాణ్ దేవ్ నటించిన విజేత సినిమాలు రెండు ఒకేరోజున థియేటర్లకు రానున్నాయని సమాచారం. జులై 6వ తేదిన విజేత సినిమాను విడుదల చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట నిర్మాత సాయి కొర్రపాటి. గతంలో జులై 6న విడుదలైన ఈగ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లి అదే సెంటిమెంట్ తో విజేతను కూడా విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నారు. గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటలిజెంట్, వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడంతో చిరంజీవి వారిపై చాలా సిరియస్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఇప్పుడు రాబోతున్న రెండు సినిమాలపై చిరంజీవి ఎలా చేస్తాడో చూడాలి.