ఇంజ‌క్ష‌న్ చేస్తుండ‌గా విరిగిన సూది.. ఆ త‌ర్వాత ఏమైందంటే..

307
injection
- Advertisement -

వైద్యుల‌ను దేవుళ్ల‌తో స‌మానంగా చూస్తారు రోగులు. అందుకే వైద్యో నారాయణో హరి అని అంటారు. సాధారణంగా మ‌నం సోష‌ల్ మీడియాలో వైద్యులు, న‌ర్సుల‌పై వ‌స్తున్న వీడియోలు, ఫోటోలు చూస్తుంటాం. రోగుల‌కు సేవ‌లందించాల్సింది పోయి సెల్ఫీలు దిగ‌డం, ఆప‌రేష‌న్ లు చేస్తుంటే ఫోన్ లు మాట్లాడటం ఇటాంటివి సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ గా మారాయి. రోగాలు న‌యం చేయాల్సిన వైద్య బృందం ఇలాంటి ప‌నులు చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతున్నారు.

injection

తాజాగా త‌మిళ‌నాడులోని ఓ ఘ‌ట‌న వైద్యుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా మారింది. ప్ర‌భుత్వ ఆస‌ప‌త్రి న‌ర్సు చేసిన నిర్ల‌క్ష్యానికి ఓ మ‌హిళ త‌న‌కు న్యాయం చేయాల‌ని వేడుకొంటోంది. తీవ్ర జ్వ‌రం తో బాధ‌ప‌డుతోన్న ఓ గ‌ర్భిణి ఆసుప‌త్రికి వ‌చ్చింది. ఆమెకు ఇంజ‌క్ష‌న్ చేస్తుండ‌గా ఆ సూది ముక్క మ‌హిళ చేతిలోనే ఇరుక్కుపోయింది. దీంతో ఇంటి కెళ్లిన మ‌హిళ కొద్ది సేప‌టి త‌ర్వాత ఆమెకు చేతిలో తీవ్రంగా నొప్పి పుట్ట‌డంతో మళ్లి తిరిగి ఆసుప్ర‌తికి వెళ్లింది. దింతో వైద్యుల వెంట‌నే ఆమె చేతిని ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే రిపోర్ట్ లో సూది ముక్క ఉన్న‌ట్టు తేలింది.

దింతో తంజావురు వైద్య క‌ళాశాల‌లో ఆమెకు శ‌స్ర్త చికిత్స‌లు చేసి ఆ సూది ముక్క‌ను తొలగించిన‌ట్టు చెప్పారు వైద్య‌లు. త‌ర్వాత రెండు రోజుల‌కు గుండె నొప్పితొ బాధ‌ప‌డుతున్న స‌ద‌రు మ‌హిళ స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి వెళ్లింది. అక్క‌డ వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయ‌గా చేతిలో సూది ముక్క ఉన్న‌ట్టు తెలిపారు. దింతో వైద్యులు ఆసూది ముక్క‌ను ఎట్ట‌కేల‌కు బ‌య‌టికి తీశారు. ఈసంద‌ర్భంగా బాధితురాలు మాట్లాడుతూ వైద్యులు తాన‌ను మోసం చేశార‌ని..సూది ముక్క‌ను తొల‌గించామ‌ని అబ‌ద్దం చెప్పార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. వెంట‌నే తంజావురు వైద్య క‌ళాశాల వైద్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకొవాల‌ని మహిళ డిమాండ్ చేస్తోంది.

- Advertisement -