కథలు దొంగలిస్తాను…విజయేంద్రప్రసాద్ షాకింగ్!

182
director
- Advertisement -

విజయేంద్ర ప్రసాద్ వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించారు. భజరంగీ భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. తన తనయుడు రాజమౌళి చిత్రాలకే కాదు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించారు.

ఇక ప్రస్తుతం మహేష్‌ – రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకు కథను సిద్ధం చేస్తున్నారు. ఇక గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఫిల్మ్ రైటింగ్‌పై స్పెషల్ క్లాస్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్లాస్ లో పలు అంశాలని మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ఒక అబద్దాన్ని అందంగా ఆచూపించడమే కథా రచన. నేను కథలు రాయను, దొంగిలిస్తాను. మన చుట్టే చాలా కథలు ఉంటాయి, నిజ జీవితంలో కూడా అనేక కథలు ఉంటాయి. అలాగే మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, మన చరిత్రల నుంచి అనేక కథలు వస్తాయి. నేను కూడా అక్కడినుంచే కథలు తీసుకుంటాను. ఆ కథలని మనదైన శైలిలో రచించాలి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -