‘థగ్ లైఫ్‌’లోకి శింబు

8
- Advertisement -

ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా నాయకుడు తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు పాన్ ఇండియా మూవీ ‘థగ్ లైఫ్’ కోసం తిరిగి జతకట్టారు. ఇ . ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో శింబు ఎంట్రీకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. శింబు లుక్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఫిల్మ్స్ అలాగే మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్, అన్బరీవ్ స్టంట్స్ అందిస్తున్నారు.

Also Read:ఏపీ హోంమంత్రిపై దాడి..దుష్టపన్నాగమేనా?

- Advertisement -