ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి జంట అంటే మాస్ కే కాదు క్లాస్ కు కూడా పిచ్చ క్రేజ్. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ గా కలిసి చేసిన ఆఖరి చిత్రం మెకానిక్ అల్లుడు. తర్వాత చిరు, విజయశాంతి జంట ఏ సినిమాలోనూ కనిపించే అవకాశం దక్కలేదు. ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలతో తనకంటూ సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నాక విజయశాంతి ఇతర హీరోల సినిమాల్లో చేయటం మానేసింది. తాజాగా వచ్చిన వార్త నిజమైన పక్షంలో సుమారు పాతికేళ్ల తర్వాత చిరు, విజయశాంతిని సైరా నరసింహారెడ్డి సినిమాలో చూసే అవకాశాలు ఉన్నాయి.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు, హిందీ, తమిళ సినీ పరిశ్రమకు చెందిన అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో విజయశాంతి కూడా ఓ కీలకపాత్రలో నటించబోతోందట. చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ‘సై రా’ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి విజయశాంతిని కలిశాడని, ఇలా విజయశాంతిని కలవడానికి స్వయంగా చిరంజీవే ఫోన్ చేసి మరీ అపాయింట్ ఇప్పించాడట. ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. యూనిట్ నుంచి అనఫీషియల్ గా అందిన సమాచారం మేరకు ఇందులో కీలకం అనిపించే ఒక చిన్న ముఖ్యమైన పాత్రకు విజయశాంతిని సంప్రదించాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ మేరకు చిరునే స్వయంగా ఫోన్ చేసి మరీ అపాయింట్మెంట్ ఇప్పించాడని టాక్.