టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు నిర్మాణంలో రూపొందుతుంది. ఈ మూవీకి సంబంధించి ఇటివలే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చూస్తుంటే మరోసారి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసేలా ఉంది. చేతిలో సిగరెట్, ముఖం రక్తపు మరకలతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా కనిపిస్తాడని సమాచారం. మరి ఈ మూవీ అర్జున్ రెడ్డిని బీట్ చేస్తుందేమో చూడాలి.