కార్పొరేట్ పన్ను తగ్గిపు శుభసూచికం- వినోద్

454
b vinod kumar
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా… దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ స్పందించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటన శుభసూచికంగా భావించవచ్చు.. ఆశ్చర్యకరమైన ప్రకటన కాదు.. రానున్న రోజుల్లో కార్పోరేట్ సెక్టర్‌కు టాక్స్ తగ్గించే ఆలోచన ఉందని మాజీ అర్థికమంత్రి అరుణ్ జైట్లీ గతంలోనే చెప్పారు. ఈ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లక్ష 45వేల కోట్ల రూపాయల రాబడి తగ్గుతుందని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే నిధులలో కూడా తగ్గముఖం పడుతుందని వినోద్‌ కుమార్‌ అన్నారు.

b vinod

కొత్త కంపెనీలకు 15శాతం టాక్స్ విధానంతో తెలంగాణ రాష్ట్రంలో ఫార్మ కంపెనీలకు బాగుటుంది.. ఇప్పటికే ఫార్మా సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కూడా చేసింది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యత ఉంది. ఉత్పత్తి రంగంలో ఏర్పాటు కాబోయే పరిశ్రమల అంశంలో తెలంగాణ రాష్ట్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందన్నారు.

లక్ష 50వేల కోట్ల లోటు అనుకుంటున్న సమయంలో అదనంగా మరో లక్ష 40వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను తగ్గించుకోవాల్సి వస్తుంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కూడా చాలా కోత పడే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడే పరిశ్రమలకు, అర్థిక మాంద్యానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రకటన విడుదల చేశారని భావిస్తున్న అని వినోద్ కుమార్ పెర్కొన్నారు.

- Advertisement -