మరోసారి మైత్రి బ్యానర్లో విజయ్ దేవరకొండ

334
Vijay Devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు చిత్రయూనిట్.

తాజాగా డియర్ కామ్రేడ్ సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు. ఈసందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా గురించి చెప్పాడు. తన తర్వాతి మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయనున్నట్లు తెలిపాడు. ఈ మూవీ ఆగిపోయిందని వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

డియర్ కామ్రేడ్ సినిమాకి ఇంత మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. విడుదలైన నాలుగు భాషల్లో అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. ఏడాదికాలం పాటు కలిసి పనిచేసిన ఈ టీమ్ లోని వాళ్లందరం దూరమైపోతుండటం బాధ కలిగిస్తోందన్నారు.

- Advertisement -