Kushi:ట్విట్టర్ రివ్యూ

54
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ గా నటించిన మూవీ ‘ఖుషి’.భారీ అంచనాల మధ్య ఇవాళ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడగా ఖుషి టాక్ బయటకు వచ్చింది.

ఖుషి టీంకు కంగ్రాట్స్…విజయ్ ఎట్టకేలకు హిట్ కొట్టారని సినిమా చూసిన వాళ్లు వెల్లడించారు. ఖుషి మంచి సినిమా.. చిన్న, సింపుల్ స్టోరీ.. విజయ్, సమంతలు బాగా నటించారు.. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయని మరికొంతమంది చెప్పారు.

సమంత యాక్టింగ్ అదిరిపోయింది.. మంచి ఫీల్ గుడ్ మూవీ అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. లాస్ట్ 30 నిమిషాలు బాగుంటుంది.. మధ్యలో కొన్ని సీన్లు భరిస్తే.. ఒకసారి సినిమాను చూడొచ్చు అని మరో నెటిజన్ తెలిపాడు. శివ నిర్వాణ మన ఆకలి తీర్చారు.. సమంత బాగానే నటించింది అని విజయ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:తెలుగులోకి కేజీఎఫ్‌ భామ

దిల్ ఖుష్ అనిపించే సినిమా.. బ్రహ్మానందం మీద చివరి షాట్ అదిరిపోయింది.. ఓ నెటిజన్ ట్వీట్ చేయగా సినిమాపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.

- Advertisement -