విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు డబుల్ ఆఫర్..!

646
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ ప్రియాంక జవల్కర్. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమానే స్టార్‌ హీరోతో చేసే ఛాన్స్ రావడం .. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీ దశ తిరిగిపోయినట్టేనని అంతా అనుకున్నారు.

Priyanka

కానీ అదికాస్తా తురుమారైంది. ఆ తరువాత ప్రియాంక తెరపై కనిపించలేదు. దాంతో ఈ అమ్మడిని అంతా మరిచిపోయారని చెప్పాలి.అయితే అదృష్టం కలిసొచ్చి తాజాగా ఈ హీరోయిన్‌ రెండు సినిమాల్లో ఆఫర్స్‌ కొట్టేసింది.

ఇటీవల విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో నటించిన హీరో కిరణ్, మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక జవల్కర్ నటిస్తోంది. ఇక శివ కందుకూరి హీరోగా దర్శకురాలు సుజన ఒక సినిమాను రూపొందించనుంది. ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా ప్రియాంక నటిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -