దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ: ఎంపి లింగయ్య యాదవ్

293
badugula lingaiah yadav
- Advertisement -

సీఎం కేసీఆర్ నేతృత్వంలో భారత దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. తెలంగాణ ప్రభుత్వం పై కావాలని బిజెపి ఎంపీలు దృష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి ఎంపీ అరవింద్ కళ్యాణాలక్ష్మి, షాధిముబారక్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. సరైన సమాధానం ఇచ్చామని..కళ్యాణాలక్ష్మి పథకం ద్వారా పేదింటి బిడ్డ పెళ్లికి సీఎం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. ఎంపీ అరవింద్‌కు చేతనైతే కేంద్రంతో ఇంకో లక్ష ఇప్పించాలన్నారు.

ఫార్మా సిటీ అడ్డుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని…కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను కలిసి ఫార్మా సిటీ అనుమతులు రద్దు చేయాలని కోరారని ఆరోపించారు. యువ నాయకుడు కేటీఆర్ ప్రపంచస్థాయి ఫార్మా సిటీ కోసం కష్టపడుతుంటే కాంగ్రెస్ నేత అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పై ఇలానే చేశారు..కాంగ్రెస్ అధికారంలో కి వస్తే దానిని మూసేస్తాం అన్నారు..అందుకే ఇలాంటి వారికి ప్రజలు ప్రతి ఎన్నికల్లో బుద్ధి చెప్తున్నారని….ప్రజలు ఇలాంటి వారిని క్షమించరని చెప్పారు.

బడ్జెట్ లో నిధులు లేవు, జిఎస్టీ, ఐజిఎస్టీ నిధుల విడుదల పై బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు ఏమి మాట్లాడరని…మేము పోరాడుతుంటే మమ్మల్ని అవహేళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -