విజయ్‌…. అదిరిందికి గ్రీన్ సిగ్నల్

254
Vijay Adirindi Ready for Release..
- Advertisement -

తమిళనాట రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతన్న మూవీ మెర్సల్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పొలిటికల్ కాంట్రవర్సికి కేరాఫ్‌గా మారిన వసూళ్లను మాత్రం ఆపలేకపోయింది.

తమిళ సినిమాతో పాటు తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ అదిరిందిని కూడా రిలీజ్‌ చేయాలని భావించారు చిత్రయూనిట్‌. కాని అనుకున్న సమయానికి తెలుగు వర్షన్‌ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్‌ వాయిదా పడింది. తెలుగు నిర్మాతలు రెండు మూడు సార్లు రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసినా సినిమా రిలీజ్‌ కాలేదు. చివరగా అక్టోబర్ 27న విడుదలవుతుందని ప్రకటించిన పలు కారణాలతో పోస్ట్ పోన్ అయింది.

జీఎస్టీ తో పాటు వైద్యులకి సంబంధించి కొన్ని వివాదాస్పద డైలాగులు ఉన్నందునే సినిమాకి సెన్సార్ జారీ చేయట్లేదని పలు వార్తలు వచ్చాయి. అయితే  ఒక్క కట్ లేకుండానే సెన్సార్ బోర్డు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివాదాస్పద డైలాగ్స్ తొలగించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారేమోనని అందరు భావించినప్పటికి, అదేమి జరగలేదు. యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. నవంబర్ 9న ఈ చిత్రాన్ని నార్త్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా ఇందులో సత్య రాజ్ , ఎస్ జె సూర్య సపోర్టింగ్ రోల్స్ పోషించారు. సమంత, కాజల్, నిత్యామీనన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -