ఆసక్తికరంగా “సర్కార్” టీజర్

288
- Advertisement -

తమిళ స్టార్ విజయ్ నటించిన చిత్రం “సర్కార్” టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తమిళ్‌లో తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్న విజయ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. అయితే.. విడుదలైన 35 నిమిషాల్లోనే ఏకంగా 30 లక్షల వ్యూస్ రాగా.. 16 గంటల్లో 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ఇక ట్విట్టర్ ట్రెండింగ్ టాప్‌లో “సర్కార్‌ టీజర్‌” హ్యాష్‌ట్యాగ్ చేరిపోయింది.

మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటును వినియోగించుకునేందుకు ఇండియాకు వస్తాడు. అనంతరం జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక ఫ్యాన్స్ సందడిగా కేకలు వేస్తున్న వీడియోను దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. “దేవుడా” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ మూవీలో కీర్తిసురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో అశోక్ వల్లభనేని చేస్తున్నారు. ఇక దీపావళి కానుకగా నవంబర్ 6న తెలుగు, తమిళంలో విడుదల కానుంది.

- Advertisement -