మాజీ ముఖ్యమంత్రి , మహానటుడు నందమూరి తారకరామారావు జివిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ అనే సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ లేకపోవడంతో ఇన్ని రోజులు ఈసినిమాకు సంబంధించిన ఎటువంటి పనులు జరగలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా క్రిష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు శర వేగంగా జరగుతున్నాయి. దర్శకుడు క్రిష్ ఈసినిమా స్క్రీన్ ప్లే పై కసరత్తు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈసినిమాకు కావల్సిన నటినటులను ఎంపీక చేసే ప్రక్రియలో ఉన్నారు దర్శకుడు క్రిష్. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన నటినటులను ప్రకటించే అవకాశం ఉందన్నారు. సాధ్యమైనంత తొందర్లో ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈసినిమాలో నటించేందుకు కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు. ఈనేపథ్యంలో నటినటుల ఎంపీకను వేగవంతం చేశారు. అటు తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో హీరో బాలకృష్ణ నటించున్నాడని మనకు తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాలో పలు క్యారెక్టర్లు సంబంధించి పలువురిని సంప్రదించారు. నారా రోహిత్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి రానా పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా మరోనటి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫీలిం నగర్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను తీసుకున్నారు. ఈ పాత్ర కోసం విద్యాబాలన్ సంప్రదించి చాలా రోజులయింది. కానీ ఆమెకు దర్శకుడు క్రిష్ ఆమె పాత్రను వివరించి చెప్పగా ఆమె ఈసినిమాలో చేయడానికి అంగీకరించింది. ఎన్టీఆర్ జీవితంలో అర్ధాంగిగా బసవతారకం కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ నటించడం ఖరారైపోయినట్టే అనుకోవచ్చు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ నుప్రారంభించనున్నారు. ఈసినిమాకు నిర్మాతగా బాలకృష్ణ వ్యవహరించనున్నారు.