దర్శకుడి ముందు మట్టిముద్దగా నిలబెడితే నన్ను తనకు కావాల్సిన విధంగా మలుచుకున్నారని మక్కల్‌సెల్వన్ విజయ్‌సేతుపతి అన్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా విడుదలై. గత నెల 31న విడుదలైన ఈసినిమా తమిళనాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హాస్య నటుడు సూరి హీరోగా నటించగా విజయ్‌సేతుపతి కీలకపాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా బృందం థ్యాంక్స్ గివింగ్ మీట్‌ను చెన్నైలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ… ఈ సినిమా కోసం మట్టిముద్దగా వెళ్లి ఆయన ముందు నిల్చున్నాను. ఆయన ఏది చెబితే ఎలా చెబితే అలాగే చేశానని అన్నారు. ఆయన చెప్పకముందే ఆయన హావభావాలను అర్థం చేసుకొని నటించా అని అన్నారు. భాష కంటే మూగసైగలే ముందు పుట్టాయి. వెట్రిమారన్‌కు జ్ఞానం అపారం. కార్యాచరణ గొప్పగా ఉంటుంది. ఈ కథలో అనేక సందేహాలు వచ్చాయి. వాటినన్నింటిని నివృత్తి చేసుకున్నాను అని అన్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌కు కారణమైన దర్శకుడు, హీరో సూరి, పంపిణీ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్, చిత్ర యూనిట్ సభ్యులకు ధన్యవాదాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి…