రానాతో సినిమా తీస్తా…..

322
Veteran filmmaker K Ashok Kumar to produce a movie featuring
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని  శ్రీకూర్మం కూర్మనాథున్ని సినీనటుడు అశోక్‌ సతీసమేతంగా దర్శించుకున్నారు. ముందుగా మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం అశోక్‌ దంపతులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు.
Veteran filmmaker K Ashok Kumar to produce a movie featuring
దేవుడ్ని దర్శించుకున్న ఆనంతరం  అశోక్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు…. తన మేనల్లుడు, దగ్గుబాటి రానాతో త్వరలో ఓ క్లాసిక్‌ సినిమా తీస్తానని  ఆయన అన్నారు. విక్టరీ వెంకటేష్‌ తర్వాత తమ కుటుంబంలో అంతటి స్థాయి నటుడిగా రానా రాణిస్తాడని, అందుకు అతడి విలక్షణ నటనే నిదర్శనమని అశోక్‌ అన్నారు. తాను ఇంతవరకు 70 సినిమాలకు పైగా నటించానని, ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్‌ ప్రారంభించానని, ప్రస్తుతం తను మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు హీరోగా సినిమా చేస్తున్నానని,… ఇప్పటికే ఈమూవీ 50 శాతం షూటింగ్‌ పూర్తయ్యిందని ప్రముఖ నిర్మాత, నటుడు కె.అశోక్‌కుమార్‌ వివరించారు.
Veteran filmmaker K Ashok Kumar to produce a movie featuring
రానా సినిమా కోసం మంచి స్కిప్ట్‌ రెడీ అవుతుందని….త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యనించారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో నటులకు కొదవలేదని, త్వరలో తెలుగు సిని పరిశ్రమ దృష్టి ఈ ప్రాంతాల్లోని ప్రకృతి దృశ్యాలపై తప్పనిసరిగా పడుతుందని ఆయన అన్నారు. గత పదిసంవత్సరాల క్రితం తను చిన్న అనారోగ్య కారణంతో అరసవల్లి సూర్యక్షేత్రానికి వచ్చానని, ఇక్కడే బస చేసి సూర్యనమస్కారాలు చేయించుకున్నానని, తర్వాత ఆరోగ్యం పొందానని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -