ప్రముఖ నటి,దర్శకురాలు విజయ నిర్మల మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆమె మృతి పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. విజయనిర్మల మరణ వార్త విని ఎంతో బాధకు గురయ్యానని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ అని… ఆమె జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు ఎన్టీఆర్. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎన్టీఆర్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
విజయ నిర్మల కన్నుమూశారన్న వార్త తనని తీవ్రంగా కలచి వేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. బాల నటిగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి, పరిశ్రమించి పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలను పొందారని…. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు.
విజయ నిర్మల మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలని కొనియాడారు. విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని విచారం వ్యక్తం చేశారు.
విజయనిర్మల మరణం దిగ్భ్రాంతికరమని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారని… ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Vijaya Nirmala Garu was a pioneering filmmaker whose life is an inspiration for many. Extremely saddened to hear the news. Extending my deepest condolences to her family. #RIPVijayaNirmalaGaru
— Jr NTR (@tarak9999) June 27, 2019