నూతన సచివాలయంకు సీఎం కేసీఆర్ భూమిపూజ

505
cm kcr
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయంకు భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,టీఎన్‌జీవో నేతలు,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొత్త సచివాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా, అన్ని సౌకర్యాలతో పూర్తి వాస్తు ప్రకారం నిర్మించనున్నారు. రూ.400 కోట్లతో నూతన సచివాలయ భవనాన్ని, రూ.100 కోట్లతో ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. అధికారులతో సమీక్షలకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ముఖ్యమంత్రి సచివాలయంలోనే నిర్వహించేలా నిర్మాణాలు రాబోతున్నాయి. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకేచోట వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.

అనంతరం ఉదయం 11 గంటల సమయంలో ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం పాత భవనం దగ్గర నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేటలోని ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ విందు ఇస్తారు.

- Advertisement -