విజయ్‌పై వేణుస్వామి సంచలనం

11
- Advertisement -

సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా పేరుగాంచిన వేణుస్వామి మరోసారి తన జ్యోతిష్యంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీవీకే (TVK) అధినేత విజయ్ జాతకంపై మరియు పశ్చిమ బెంగాల్ రాజకీయ సంక్షోభంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ జాతకంలో ‘త్రిష’ ప్రభావం?
తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ గురించి వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ రాజకీయ ఎదుగుదలకు, ఆయన వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధాన్ని జ్యోతిష్య పరంగా విశ్లేషించారు. నటి త్రిష గనుక విజయ్ జీవితంలో లేకుండా ఉండి ఉంటే.. ఆయన జాతకం, రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మరోలా ఉండేవి అని వేణుస్వామి వ్యాఖ్యానించారు.

ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయినా.. ఆ పదవిలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేరని జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు లేదా ఏడాదిలోపు తమిళనాడులో మళ్లీ మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై కూడా వేణుస్వామి స్పందించారు. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మమతా బెనర్జీ భవిష్యత్తుపై ఆయన కీలక అంచనా వేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వేణుస్వామి స్పష్టం చేశారు. బెంగాల్‌లో పరిస్థితులు మరింత గజారి, అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. వేణుస్వామి గతంలో చెప్పిన కొన్ని జోస్యాలు నిజమవ్వడంతో, తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు మరియు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష పేరును లాగడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్‌ ఆలయం

- Advertisement -