మే 20న నిరుద్యోగ ఆవేదన సభ

3
- Advertisement -

నిరుద్యోగుల ఆవేదన సభ పోస్టర్ ఆవిష్కరించింది నిరుద్యోగ జేఏసీ . సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నేత అస్మా మాట్లాడుతూ.. అసలు ఈ ప్రభుత్వం ఏం పాలన చేస్తుంది..?,ఏజ్ రిలాక్సేషన్ జీవో 30 నీ కొనసాగించాలి…జూన్ 2 లోపు నోటిఫికేషన్లు విడుదల చేయాలిఅని డిమాండ్ చేశారు.

జీవో నెంబర్స్ 04,29,46,108 జీవోలను వెంటనే రద్దు చేయాలి … మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలి … ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోవాలి… జూన్2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబురాలు చేసుకోవాలో..ఆందోళన చేయాలో.. రేవంత్ రెడ్డి నిర్ణయించాలి అన్నారు. మే 20 న నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహిస్తున్నాం …పోలీసులు ఆటంకాలు సృష్టించిన నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహిస్తాం అన్నారు.

లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం..ఇంకా ఆగే ప్రసక్తే లేదు…తెలంగాణ వచ్చిందే నీళ్లు,నిధులు, నియామకాల కోసం..కానీ ఈ రేవంత్ రెడ్డి కోసం కాదు..రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త .. ఇంటిని ముట్టడిస్తాం..వెంటనే జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు కరోనా వైరస్ లాగ ఉంది…వ్యాక్సిన్ రూపంలో కాంగ్రెస్ పార్టీ కి నిరుద్యోగుల గుణపాఠం చెబుతాం అన్నారు. ఏజ్ రిలాక్సేషన్ పై ఎలాంటి ప్రస్తావన తీసుకురావడం లేదు…గత ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు…మరీ ఈ ప్రభుత్వానికి ఏమైంది..?,మంత్రి పొంగులేటి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు …కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిండా మోసం చేసింది …గత ఎన్నికల ముందు కాంగ్రెస్ మాటలు విని మోసపోయాం..ఈ నెల 20 ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహిస్తున్నాం అన్నారు. అసలు జాబ్ క్యాలెండర్ లేదు..
త్వరలో కాంగ్రెస్ నాయకుల ఇండ్లను ముట్టడిస్తాం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది..ఇప్పుడు ఏమైంది.. ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు..కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది అన్నారు నిరుద్యోగ జేఏసీ నేత ఉపేందర్. అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారు..దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ..ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆవేదన కనిపించడం లేదా..?,అన్నీ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి.. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు..ముఖ్యమంత్రి నిరుద్యోగులు మీకు కనిపించడం లేదా..?,రాజకీయంగా అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు.. మా నిరుద్యోగులు కనిపించడం లేదా..?,రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తాం అన్నారు.

నిరుద్యోగుల సమస్యలు వినడానికి రేవంత్ రెడ్డికి సమయం దొరకడం లేదు..కానీ అన్ని పెళ్లిళ్లకు హాజరయ్యే సమయం దొరుకుతుంది..ప్రభుత్వానికి నిజానికి చిత్తశుద్ధి ఉంటే జూన్2 వరకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ..ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ..కాంగ్రెస్ ప్రభుత్వం దగా కోరు ప్రభుత్వం …తెలంగాణ ను ముఖ్యమంత్రి నిరుద్యోగ హబ్ గా మార్చారు…నిరుద్యోగులే కదా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది.. గుర్తులేదా..? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల తడాఖా అంటే ఏంటో.. చూపెడుతాం..రేవంత్ రెడ్డి బాధ్యత రహితంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నారు.

రేవంత్ తెలంగాణకు పట్టిన దరిద్రం…అమలు కానీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నారు ఖాసీం. కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయాం..గత పదేళ్లు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ …రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు..2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు మా పోరాటం ఆగదు …ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి …గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయాలి …ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన నిరుద్యుగ ఆవేదన సభను నిర్వహిస్తాం…తెలంగాణ మొత్తం నిరుద్యోగులు సభకు హారవుతారు…మాట తప్పిన రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడతాం…తెలంగాణలో ప్రజా పాలన లేదు.. దౌర్భాగ్య పాలన కొనసాగుతుంది..రేవంత్ రెడ్డికి రోజుల దగ్గర పడ్డాయి.. నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

- Advertisement -