మెగాప్రిన్స్ వరుణ్ తేజ్,విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-3. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేష్ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
-అనుకోకుండా నా గత రెండు చిత్రాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో వచ్చాయి. రెండేళ్ల తర్వాత థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గుంపుగా సినిమా చూస్తే వచ్చే కిక్ వేరు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు బిగ్స్క్రీన్పై చూస్తే బాగుంటుంది. ఎఫ్-3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. అందరికి నచ్చుతుంది.
-కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. స్నేహితులతో కానీ, ఇంట్లో కానీ నేను జోకర్‌గానే ఉంటాను.
-అనిల్ రావిపూడి రచన నాకు చాలా ఇష్టం. ఆయన పాత్రలను చాలా నేచురల్‌గా తీర్చిదిద్దుతాడు. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈవీవీ గారి మాదిరే అనిల్ కామెడీ బాగా పండిస్తాడు. అనిల్ నుంచి చాలా నేర్చుకున్నా.
-మన చుట్టూ ఉన్న జనాలను చూసే నేను అన్ని నేర్చుకుంటా. ఎఫ్-3లో కామెడీ చాలా బాగుంటుంది. డిఫరెంట్ వాయిస్ యూజ్ చేశా.
-ఈ సినిమాలో రేచీకటి పాత్రను పోషించాను. అలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం రేచీకటి ఉండదు. కొంతవరకు మాత్రమే ఉంటుంది. కథలో భాగంగా ఈ చిత్రంలో నా పాత్రకు రేచీకటి ఉంటుంది.
-ఎఫ్3 ఏ స్థాయిలో హిట్ అవుతుందో నేను చెప్పలేను కానీ..ఎఫ్2 కంటే హిలేరియస్‌గా ఉంటుందని మాత్రం చెప్తా.
-ఈ జానర్ సినిమాలే చేయాలని ఏమి అనుకోలేదు. ఆడియన్స్‌కు ఏం ఇష్టమో అది ఇస్తే చాలు. వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోవాలి అంతే. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పని చేసుకుంటూ వెళ్లాలి.
-కోవిడ్ తర్వాత ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశా. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో.. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేశా. అది చాలా చాలెంజింగ్ అనిపించింది. త్వరలోనే వెబ్సిరీస్లోని నా లుక్ విడుదల కాబోతుంది.
-సల్మాన్‌ఖాన్‌తో తీయబోయే చిత్రంలో బ్రదర్ పాత్రని పోషిస్తున్నాను.
-మల్టీస్టారర్ చిత్రాలకు నేను ఎప్పటికీ సిద్దంగానే ఉంటాను. మంచి కథ దొరికితే ఏ హీరోతోనైనా కలిసి నటిస్తా.
-బాక్సాఫీస్ నెంబర్లను నేను నమ్మను. కానీ నిర్మాతలకు లాభాలు రావాలని ఆశిస్తాను.అలాగే ఫ్యాన్స్‌ని, అడియన్స్‌ని అలరిస్తే చాలు అనుకుంటా. ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాను.
-సెట్లో నేను నిర్మాత మాదిరే ఆలోచిస్తాను. ఏదైనా వృధా అయితే చాలా బాధ కలుగుతుంది. సినిమా షూటింగ్‌కు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం నసగా ఉంటంది. కానీ మూవీ హిట్ అయితే మాత్రం అవన్నీ మర్చిపోతారు.
-పాన్ ఇండియా చిత్రాలు అనేది కేవలం బిజినెస్ మాత్రమే. నా సినిమాకు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఉందనుకుంటే..అంతటా విడుదల చేస్తారు. లేదంటే ఇక్కడే రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా స్థాయి కథలు వస్తే.. నేను చేయడానికి సిద్దమే.
-టాక్ షోలకు హోస్టింగ్‌గా చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు అది సెట్ కాదు. ఒక్క సీన్ మళ్లీ మళ్లీ చేయడం నాకు కష్టం. సింగిల్ టేక్ యాక్టర్‌గా ఉండడమే నాకు ఇష్టం.
-కోవిడ్ టైమ్‌లో షూటింగ్స్ చాలా కష్టంగా జరిగాయి. మన ముందు ఉన్న ఆర్టిస్ట్‌కు కరోనా ఉందో లేదో తెలియదు. మేము ఏమో మాస్క్ తీసి డైలాగ్స్ చెప్పాలి. చాలా భయమేసేది. షూటింగ్ అయిపోగానే క్యారివాన్లోకి వెళ్లి ఆవిరి పట్టేవాడిని. ఈ రెండేన్నరేళ్లలో నేను కోవిడ్ బారిన పడలేదు. నేను ఇప్పటికీ మాస్కులు ధరిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తేనే మంచిదని నా భావన.
-వివేకానంద బయోపిక్ తీయాలనుకున్నాడు కానీ ఇప్పటీకీ కుదరలేదు. ఇప్పుడు బయోపిక్ తీయాలని లేదు. నాన్నగారి(ప్రముఖ నిర్మాత రామానాయుడు) బయోపిక్ స్క్రిప్ట్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను.
-ఎఫ్2లో మాదిరి ఎఫ్3లో ఎలాంటి కొత్త ఆసనాలు ఉండవు. కానీ కామెడీ మాత్రం అంతకు మించి ఉంటుంది. ప్రతి సన్నీవేశం నవ్వులు పూయిస్తాయి. ఈ జనరేషన్ పిల్లలను కూడా అలరించడం అదృష్టంగా భావిస్తున్నాను.
-దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.