దూసుకుపోతున్న ‘వీరసింహారెడ్డి’

49
- Advertisement -

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో బాల‌కృష్ణ నటించిన సినిమా వీర‌సింహా రెడ్డి. ఈ సినిమా ట్రైల‌ర్ను ఒంగోలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. సినిమాకు గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ఎందుకు పెట్టార‌ని ట్రైలర్‌‌ చూస్తే అర్ధమవుతుంది. బాలయ్య లుక్స్, డాన్స్లు, రీరికార్డింగ్ అన్నీ అదిరిపోయాయి. దాంతో ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ యూట్యూబ్‌లో ఒక రేంజ్‌లో దూసుకుపోతుంది. నిన్న రాత్రి విడుదల చేసిన ఈ ట్రైలర్‌కు 5 మిలియన్ ప్లస్ వ్యూస్.. 300K ప్లస్ లైక్స్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే వీరసింహా రెడ్డి సినిమా నుంచి రిలీజైన ప్ర‌తీ కంటెంట్ ప్రేక్ష‌కులకు అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. అన్నిటికీ మించి ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. పైగా ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ బాలయ్య మాస్ స్టెప్స్ వేశాడు.

పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయట. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఓపెనింగ్ సీన్ పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. సినిమా ఫస్ట్ సీన్ లోనే బాలయ్య డెడ్ బాడీ ఊరేగింపు ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

నేడు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ రిలీజ్‌

అజిత్‌కు విలన్‌ దొరికేశాడు

ధనుష్…చోరుడు ఫస్ట్ లుక్ లాంచ్

- Advertisement -