రేపట్నుంచి జల్లికట్టు…

58
- Advertisement -

తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు జల్లికట్టు క్రీడకు ఆనుమతిచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో నిర్వహించేందుకు అనుమతినివ్వగా…రేపటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని కందర్వక్కోట్టై సమీపంలోని దాచంకురిచిలో ప్రతిసంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తారు. ఇది తమిళ సంగమ చరిత్ర కాలంనుంచి జల్లికట్టు క్రీడలు కొనసాగుతుంది.

తమిళ చరిత్రకారుల అంచనా ప్రకారం మొదటి జల్లికట్టు తచ్చన్కురిచి జల్లికట్టుగా ప్రసిద్ది చేందింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జీవ హింస నేరం కావడం చేత తమిళానాడులోని జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధించే దిశగా అడుగులు వేసింది. కానీ తమిళం ప్రజలు నిషేధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు సైతం చెపట్టారు. దీంతో జల్లికట్టును ప్రభుత్వం మార్గదర్శాకాల ప్రకారం నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. దాంతో ప్రతియేటా జల్లికట్టును నిర్వహిస్తున్నారు. అయితే గత రెండెండ్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా జల్లికట్టు క్రీడ కూడా అర్థాంతరంగా నిలిచిపోయింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనవరి 2నుంచి జల్లికట్టు క్రీడ ప్రారంభం కావాల్సి ఉండగా పాలనపరమైన కారణాలతో దానిని జనవరి 6కు మార్చారు. అయితే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. దీంతో స్టాలిన్‌ ప్రభుత్వం మార్గదర్శాకలతో కూడిన అనుమతిని ఇచ్చింది. రేపటి నుంచి పోటీలు జరగనుండగా ప్రేక్షకులకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది. వీక్షకుల సంఖ్యను మూడు వందలకు మించి ఉండకూడదని నిబంధనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ… తమిళనాడు తొలి జల్లికట్టుగా ఏటా తాచంకురిచ్చి జల్లికట్టు జరుగుతోందని.. భద్రతా ఏర్పాట్లు బాగోలేదని 2వ తేదీ నుంచి 6వ తేదీకి మార్చామని.. కానీ మళ్లీ దాన్ని మార్చామని తెలిపారు. తిరిగి రేపట్నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన బుల్లితెర నటి

గంగా విలాస్ క్రూయిజ్..ధర ఎంతంటే..?

మొక్కలు నాటిన రిటైర్డ్ జస్టిస్‌…

- Advertisement -