నేడు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ రిలీజ్‌

58
Megastar Chiranjeevi Waltair Veerayya trailer
Megastar Chiranjeevi Waltair Veerayya trailer
- Advertisement -

సంక్రాంతి వచ్చిదంటే చాలు… సినీ ప్రేక్షకులకు పండగ అనే చెప్పాలి. ఈ సంక్రాంతి బరిలో ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు నిలవబోతున్నాయి. ఒకటి మెగాస్టార్‌ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కాగా మరోకటి.. బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి.. అయితే ఇప్పటికే వీరసింహరెడ్డి సినిమా ట్రైలర్ రిలీజై దుమ్ములేపుతోంది. బాలకృష్ణ డైలాగులకు జనం జేజేలు పలుకుతున్నారు. ఇక సినిమాలో డైలాగులతో థియేటర్స్‌ దద్ధరిల్లడం ఖాయమంటూ బాలయ్య బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్‌ సైతం ఇవాళ రిలీజ్‌ కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందోనన్న ఆందోళన మెగా అభిమానుల్లో నెలకొంది. దీనికి కారణం చిరంజీవి రీఎంట్రీ తర్వాత 150 మూవీ మినహా మిగతా 3 సినిమాలు అంతంత మాత్రంగానే ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందోనన్న చర్చ సాగుతోంది.

అయితే ఇప్పటికే వాల్తేరు వీరయ్యపై చిత్ర యూనిట్‌ ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్‌ ను గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత మరింత బజ్‌ వస్తుందన ప్రచారం కూడా సాగుతోంది. అయితే సంక్రాంతి బరిలో నిలుస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి.

ఇవి కూడా చదవండి

చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్‌

మత్తెక్కిస్తున్న శ్రద్దాదాస్‌..

హీరోయిన్ కోసం గొడవపడ్డ ప్రభాస్‌, గోపిచంద్

 

- Advertisement -