బాలయ్య ఏదైనా ఓపెన్ గా మాట్లాడేస్తుంటాడు. ఈ విషయం గురించి ఇది వరకే పలుసార్లు చెప్పారు బాలయ్య, వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడు సినిమా తనకు రాంగ్ చాయిస్ అయ్యిందంటూ బాలయ్య గతంలోనే చెప్పారు. సోషల్ మెసేజ్ తో సాగే యాక్షన్ డ్రామా అయిన ఒక్క మగాడు సినిమా పై నేటికీ బోలెడన్ని సెటైర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఆ సినిమాలో యాక్షన్ సీన్లు సీన్లుగా చూసినప్పుడు బాగానే ఉంటుంది. అయితే.. థియేటర్లలో మాత్రం ఒక్కమగాడు ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టింది.
ఇంతకీ వీరసింహా రెడ్డి టైమ్ లో ఒక్క మగాడు గోల ఏమిటి?, వీరసింహా రెడ్డి స్టార్టింగ్ సీన్స్ చూసిన కొందరు యాంటీ ఫ్యాన్స్ ‘మరో ఒక్క మగాడు’ అంటూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత వీరసింహా రెడ్డి ట్రాక్ లోకి వచ్చింది. అదరగొట్టింది. దాంతో మరో ఒక్క మగాడు అనే ట్రోల్ ఆగిపోయింది. నిజానికి తన సినిమాకు ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ లభించకపోయినా, తమ సినిమా థియేటర్లలో హిట్ కాకపోయినా.. టీవీల్లో మాత్రం బాగా ఆడిందంటూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ బాలయ్య ఎన్నడూ అలా చెప్పలేదు.
ఒక్క మగాడు, పలనాటి బ్రహ్మ నాయుడు వంటి చిత్రాల విషయంలో మాత్రం బాలయ్య ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాడు. ఆ సినిమాలు తను చేయాల్సింది కాదంటూ బాలయ్య అంగీకరిస్తూనే ఉంటారు. ఏది ఏమైనా బాలయ్య నిజాయితీకి హ్యాట్సాఫ్. అలాగే, వీరసింహా రెడ్డి.. ఒక్క మగాడు కానందుకు సంతోషిద్దాం.
ఇవి కూడా చదవండి…